కింగ్డమ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్టేనా..?

by I. Sairam |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’(Kingdom).

కింగ్డమ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్టేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈమూవీ నేడు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసినవాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూస్ పంచుకుంటున్నారు. ఇంతకీ ట్విట్టర్‌లో రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కింగ్‏డమ్ సినిమాకు యూఎస్ ప్రీమియర్ షోస్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారని.. ఎమోషన్స్, హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకున్నాయి. విజువల్స్, క్వాలీటి పర్ఫెక్ట్‌గా ఉన్నాయని.. రౌడీ హీరో నుంచి ఫ్యాన్స్ ఊహించిన దానికంటే హై లెవల్లో మాస్ యాక్షన్ ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో జైలు సీన్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అని అంటున్నారు. సెకండాఫ్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉందని, డైలాగ్స్ మెంటలెక్కిస్తున్నాయని ట్విట్టర్లో తెలుపుతున్నారు. అయితే ఎప్పటిలాగే అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టగా.. విజయ్ మాస్ హీరోగా ఇరగదీశాడని. ఫైనల్‌గా ఈ మూవీతో విజయ్ మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని ట్వీట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. Link

Next Story