‘కింగ్డమ్’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. మళ్లీ ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ హీరో..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-25 06:50:43  IST  )

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) జంటగా గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కింగ్డమ్'(Kingdom).

‘కింగ్డమ్’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. మళ్లీ ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ హీరో..
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) జంటగా గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కింగ్డమ్'(Kingdom). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా మే 30న విడుదల కానుంది . ఇక దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా లేటెస్ట్‌గా ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్.

‘కింగ్డమ్’ సినిమా నుంచి 'హృదయం లోపల' అనే పాటను చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంతకంటే ముందుగా తాజాగా సాంగ్ ప్రోమోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సేలపై ఈ రొమాంటిక్ మెలోడీని షూట్ చేసారు. బీచ్ ఒడ్డున ఇద్దరూ కూర్చొని ఉండగా.. విజయ్‌కి భాగ్యశ్రీ ముద్దు పెడుతుంది. 'ఆ వైట్ షర్ట్ తెలిసినట్లు అనిపిస్తే' అని చెప్పగా.. 'అయితే ఆపొద్దేమో' అంటూ ఘాడమైన లిప్ లాక్‌తో రెచ్చిపోయారు. ఈ ప్రోమో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. రౌడీ హీరో సినిమా అంటే ఆమాత్రం ముద్దులు ఉండాలిలే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మే 2న ఫుల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు.

Link

Next Story