Kingdom: రౌడీ హీరో ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. మ‌ళ్ళీ ‘కింగ్‌డ‌మ్’ వాయిదా? కార‌ణం ఏంటంటే..?

by Gugulothu.Kavitha |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్‌’(Kingdom).

Kingdom: రౌడీ హీరో ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. మ‌ళ్ళీ ‘కింగ్‌డ‌మ్’ వాయిదా? కార‌ణం ఏంటంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్‌’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తోన్న విజయ్‌ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ మూవీ.. మరోసారి పోస్ట్‌పోన్‌ అయ్యేలా క‌నిపిస్తోంది. అయితే ఈ సినిమా మరింత లేట్‌ అవ్వడానికి రీజన్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండటమే అనే చర్చ జరుగుతోంది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌(Anirudh) కింగ్‌డమ్‌ సినిమా రీరికార్డింగ్‌ వర్క్‌ని ఇంకా కంప్లీట్‌ చేయనట్లుగా తెలుస్తోంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కోసం మరింత సమయం తీసుకుంటున్న అనిరుధ్.. ఈ మంత్‌ ఎండింగ్‌లోగా పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నారు. వన్స్‌ అనిరుధ్‌ సినిమాకి ఆర్ఆర్‌ ఫినిష్‌ చేస్తే.. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసి.. మరింత ప్రమోషనల్ కంటెంట్‌ని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది కింగ్‌డమ్‌ యూనిట్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇది విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే అనే చెప్పాలి.

Next Story