పిల్లలకు విలువలు నేర్పించే ‘కికి అండ్ కొకొ’.. మరో యానిమేషన్ ఫిల్మ్ సిద్ధం

by Sujitha Rachapalli |

యానిమేషన్ ఫిల్మ్ ‘మహా అవతార్ నరసింహ’ రికార్డ్ స్థాయిలోవసూళ్లు సాధించింది. మరో యానిమేషన్ ఫిల్మ్ ‘కికి & కోకో’ ఇందుకు సిద్ధమవుతోంది. పిల్లలకు పిల్లల మనసున్న పెద్దలకు నచ్చేలా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇనికా స్టూడియోస్ మన ముందుకు తీసుకొస్తోంది. ధరణి నిర్మాత కాగా పి. నారాయణన్

పిల్లలకు విలువలు నేర్పించే ‘కికి అండ్ కొకొ’.. మరో యానిమేషన్ ఫిల్మ్ సిద్ధం
X

దిశ, సినిమా : యానిమేషన్ ఫిల్మ్ ‘మహా అవతార్ నరసింహ’ రికార్డ్ స్థాయిలోవసూళ్లు సాధించింది. మరో యానిమేషన్ ఫిల్మ్ ‘కికి & కోకో’ ఇందుకు సిద్ధమవుతోంది. పిల్లలకు పిల్లల మనసున్న పెద్దలకు నచ్చేలా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇనికా స్టూడియోస్ మన ముందుకు తీసుకొస్తోంది. ధరణి నిర్మాత కాగా పి. నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలనటి శ్రీనిక కోకో పాత్రలో నటిస్తోంది. మీనా చాబ్రియా సీయీవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న యానిమేషన్ ఈ మూవీ త్వరలో థియేటర్స్‌తో పాటు తొమ్మిది భాషల్లో ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ యానిమేషన్ మూవీ హైలైట్స్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత.. ‘మా ‘కికి అండ్ కోకో’ యానిమేషన్ సినిమా ద్వారా పిల్లలకు మన ఎమోషన్స్, వ్యాల్యూస్‌ను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. జీవితంలోని వాస్తవికతను, మంచిని బాల బాలికలకు నేర్పాలనేది మా ముఖ్య ఉద్దేశం. థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ రిలీజ్ చేయబోతున్నాం’ అని తెలిపారు.

Next Story