Bigg Boss Season-11: బిగ్‌బాస్ విన్నర్‌‌ను ప్రకటించిన కిచ్చా సుదీప్.. రైతుబిడ్డ గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతంటే?(వీడియో)

by Mallepaka Hamsa |

రియాలిటీ బిగ్‌బాస్ షో(Bigg Boss Show) అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లు పూర్తి చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Bigg Boss Season-11: బిగ్‌బాస్ విన్నర్‌‌ను ప్రకటించిన కిచ్చా సుదీప్.. రైతుబిడ్డ గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతంటే?(వీడియో)
X

దిశ, సినిమా: రియాలిటీ బిగ్‌బాస్ షో(Bigg Boss Show) అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లు పూర్తి చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే కన్నడలో సీజన్11 కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సుమారు 120 రోజులుగా కొనసాగిన ఈ షో జనవరి 26న ముగిసింది. అయితే ఫినాలేలో వైల్డ్ కార్డ్(Wild card) ఎంట్రీ ఇచ్చిన హనుమంతు(Hanumanthu), త్రివిక్రమ్(Trivikram) నిలిచారు.

అయితే ఇందులో రైతుబిడ్డ హనుమంత్ విజేతగా నిలిచినట్లు సుదీప్ వెల్లడించారు. అయితే రన్నర‌ప్‌గా త్రివిక్రమ్ 10 లక్షలు గెలుచుకున్నారు. ఇక విజేత రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా, విన్నర్ హనుమంత్ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌(Influencer)గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా 2018లో సారిగమప కన్నడ15వ సీజన్‌లో రన్నరప్‌గా నిలచాడు. ఆ తర్వాత కర్ణాటక డ్యాన్స్ సీజన్2లో పాల్గొని తన టాలెంట్‌తో స్టార్ అయిపోయారు. ఇక బిగ్‌బాస్‌లో చాన్స్ అందుకుని 21న రోజున హైస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులకు దగ్గరై మొత్తానికి విన్నర్ అయిపోయాడు.

Next Story