- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KHxRK: బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రజనీ-కమల్ పారితోషకాలు కూడా నెక్స్ట్ లెవెల్‌లోనే
KHxRK చిత్రాన్ని రూ.600 నుంచి రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ - లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను KHxRK అనే వర్కింగ్ టైటిల్‌తో విడుదల చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని ప్రకారం ఈ చిత్రాన్ని ఏకంగా రూ.600 నుంచి రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నట్లు సమాచారం.
ఈ సినిమా కోసం కమల్ హాసన్ రూ.200 నుంచి రూ.220 కోట్ల వరకు పారితోషకం తీసుకోనున్నట్లు, అలాగే లాభాల్లో కూడా వాటా పొందనున్నట్లు తెలుస్తోంది. ఇక రజనీకాంత్ ఈ మూవీ కోసం రూ.180 నుంచి రూ.200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి రూ.70 కోట్ల వరకు పారితోషకం తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా ప్రధానంగా ఈ ముగ్గురి పారితోషకాలకే భారీ మొత్తంలో ఖర్చు అవుతుండగా, మిగిలిన బడ్జెట్‌తో సినిమాను రూపొందించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.






