- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Khushi Kapoor: మెహందీ డే అంటూ ఫొటోలు షేర్ చేసి షాకిచ్చిన ఖుషీ కపూర్

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) చిన్న కుమార్తె ఖుషీ కపూర్(Khushi Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ‘లవ్ టుడే’(Love Today) రీమేక్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె గత ఏడాది ‘ది అర్చీస్’(The Archies)తో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈక్రమంలోనే ఖుషీ, వేదాంగ్ రైనా(Vedang Raina)తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె సినిమాల్లో నటించినదానికంటే సోషల్ మీడియా(Social Media) ద్వారానే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది.
ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అమ్మడు అందాలకు నెటిజన్లు ఫిదా అవ్వడంతో పాటు ప్రశంసలు కూడా కురిపిస్తుంటారు. తాజాగా, ఖుషీ కపూర్ గార్జీయస్ లుక్‌తో దర్శనమిచ్చింది. మల్టీ కలర్ చీర ధరించిన ఆమె మత్తెక్కించే చూపులతో కుర్రకారును ఫిదా చేసింది. అయితే ఈ పోస్ట్‌కు ఖుషీ కపూర్ ‘మెహందీ డే’ అనే క్యాప్షన్ పెట్టింది. దీంతో సడెన్‌గా చూసిన వారంతా పెళ్లి చేసుకోబోతుందా? అని షాక్ అయ్యారు. కానీ అవి తన ఫ్రెండ్ పెళ్లిలో భాగంగా తీసుకున్నవి అని తెలుసుకుని కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ ఫొటోలకు ఫైర్ ఎమోజీలు షేర్ చేయడంతో పాటు వావ్ అని కామెంట్స్ పెడుతున్నారు.