KGF: కన్నడ మూవీ ఇండస్ట్రీలో విషాదం.. KGF నటుడు కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-06 07:36:50  IST  )

కన్నడ మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

KGF: కన్నడ మూవీ ఇండస్ట్రీలో విషాదం.. KGF నటుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేజీఎఫ్ (KGF) మూవీ ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Roy)ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన ఇవాళ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేజీఎఫ్-1 మూవీలో ఆయన హీరో యశ్ పక్కన చాచా పాత్రలో కనిపించారు. అయితే, మూవీ సెకండ్ పార్ట్ పూర్తి అయ్యే నాటికి హరీశ్‌రాయ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం వ్యాధి చివరి స్టేజ్‌కు చేరడంతో పూర్తిగా గుర్తు పట్టని విధంగా బక్కచిక్కిపోయారు. అయితే, హరీశ్‌రాయ్ మృతి పట్ల కన్నడ మూవీ ఇండస్ట్రీలో పలువురు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కేజీఎఫ్ మూవీ టీమ్ హరీశ్‌రాయ్ ఓ గొప్ప నటుడని..సోషల్ మీడియాలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు.

Next Story