ట్రెండీ వేర్‌లో గత్తరలేపుతున్న కేజీఎఫ్ బ్యూటీ.. ఇంటర్నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ట్రెండీ వేర్‌లో గత్తరలేపుతున్న కేజీఎఫ్ బ్యూటీ.. ఇంటర్నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా హిట్-3 మూవీతో మనముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీనిధి ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో వైట్ కలర్ డ్రెస్‌లో ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చింది. వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ వావ్ అనిపించింది. దీనికి జస్ట్ అనే క్యాప్షన్ జోడించడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఇంటర్‌నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ ఫొటోస్‌ను మీరు ఓ సారి చూసేయండి.

Next Story