- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ సినిమాను ఆడించాలంటే అదృష్టం ఉండాలి: ఎగ్జిబిటర్లు
థియేటర్ల ఇష్యూపై ఏపీ ఎగ్జిబిటర్లు(Exhibitors), డిస్ట్రిబిటర్లు స్పందించారు. ఈ మేరకు బుధవారం వారు మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: థియేటర్ల ఇష్యూపై ఏపీ ఎగ్జిబిటర్లు(Exhibitors), డిస్ట్రిబిటర్లు స్పందించారు. ఈ మేరకు బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో నిజంగానే థియేటర్లు మూసుకునే పరిస్థితి ఉందని కుండబద్దలు కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేశ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రికి, ప్రభుత్వానికి చాలా పెద్ద కృతజ్ఞతలు చెప్పారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాను బంద్ చేస్తామని తాము ఏనాడూ అనలేదని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన చర్చలు వేరు.. బయటకు వచ్చింది వేరని అన్నారు. తమ వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపడం ఎవరి తరం కాదు.. అది మాటల్లో చెప్పినంత ఈజీ కూడా కాదని వెల్లడించారు. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రతీసారి తాము ఎదురుచూస్తాం.. ఆయన సినిమాలు చాలా ఆనందంగా విడుదల చేస్తామని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ సినిమాలు ఆడించాలంటే అదృష్టం ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాంటిది మేమెందుకు అడ్డుకుంటామని అన్నారు. ఇప్పుడు రిలీజ్ కాబోయే హరిహర వీరమల్లు సినిమాను కూడా ఎలా ఉన్నా ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్ అత్యుతరామయ్య ప్రకటించారు.
మరోవైపు.. ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో నిన్న, ఈరోజు తనిఖీలు కొనసాగాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు జాయింట్ఆపరేషన్చేసి హాళ్లలో ఉన్న సదుపాయాల గురించి ఆరా తీశారు. థియేటర్లలో తీసుకున్న భద్రతా చర్యలు, అవసరమైన సదుపాయాల లభ్యతపై అధికారులు సమగ్ర సమాచారం సేకరిచారు. అలాగే థియేటర్ క్యాంటీన్లలో ధరల పట్టిక ప్రదర్శన, టికెట్లతో పాటు ఆహార పదార్థాలను ఎంత ధరకు విక్రయిస్తున్నారన్న విషయాలపై కూడా పరిశీలించారు. సేకరించిన వివరాలతో తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధం అయ్యారు.
#HHVM సినిమా ఏ విధంగా అయినా ప్రదర్శిస్తాం.. pic.twitter.com/uU2yLI7yRM
— devipriya (@sairaaj44) May 28, 2025






