సినీ కార్మికుల సమ్మెలో కీలక పరిణామం.. ఫిలిం ఫెడరేషన్ లీడర్స్‌కు లీగల్ నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-08 04:22:12  IST  )

ఐదు రోజులుగా తమ వేతనాలను పెంచాలంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (Telugu Film Industry Employees Federation) కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే.

సినీ కార్మికుల సమ్మెలో కీలక పరిణామం.. ఫిలిం ఫెడరేషన్ లీడర్స్‌కు లీగల్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు రోజులుగా తమ వేతనాలను పెంచాలంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (Telugu Film Industry Employees Federation) కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే. దీంతో టాలీవుడ్‌ (Tollywood)లో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఎక్కడికక్కడ షూటింగ్స్‌ నిలిచిపోయాయి. నాలుగు రోజులుగా చర్చలు కొనసాగుతోన్న ఎలాంటి నిర్మాతల మండలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వేతనాలు పెంచబోమని వారి నుంచి ప్రకటన వెలువడినా.. పనుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెల్లబోమని సమ్మెలో భీష్మించుకు కూర్చుకున్నారు.

ఈ నేపథ్యంలోనే నిర్మాతలు, కార్మికుల మధ్య చర్చలు కొలిక్కి వస్తున్న వేళ ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) కార్మికుల ఆకస్మిక సమ్మె కారణంగా రోజుకు రూ.కోటి నష్టపోతున్నానని సిటీ సివిల్ కోర్టు (City Civil Court)లో కేసు ఫైల్ చేశారు. అదేవిధంగా ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్, సెక్రటరీ అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్‌కు లీగల్ నోటీసులు కూడా పంపారు. దీంతో కార్మికులంతా నిర్మాత విశ్వప్రసాద్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు జరుగుతుండగా.. ఇలా కోర్టుకు వెల్లడం ఏంటని మండిపడుతున్నారు.

Next Story