- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘Kesari-2’ Trailer: ‘కేసరి-2’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), అనన్య పాండే (Ananya Panday), రెజీనా, ఆర్. మాధవన్ (R. Madhavan) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), అనన్య పాండే (Ananya Panday), రెజీనా, ఆర్. మాధవన్ (R. Madhavan) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2. కరణ్ సింగ్ త్యాగీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోత ఆధారంగా తెరకెక్కించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి హిట్ టాక్‌తో పాటు ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.
ఇప్పుడు ఈ చిత్రం తెలుగులోకి డబ్ అయ్యి, మే 23న విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించగా.. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది. అయితే తాజాగా 'కేసరి -2' మేకర్స్ తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ తరువాత జరిగిన సంఘటనలు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, అక్షయ్ కుమార్ పాత్ర చేసిన న్యాయపోరాటాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ ట్రైలర్ గూస్‌బంబ్స్ తెప్పిస్తున్నాయి.
అక్షయ్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. తన కెరీర్‌లోని అత్యుత్తమ నటన ప్రదర్శించారు. ఆర్. మాధవన్, అనన్య పాండే పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. దర్శకుడు సమగ్ర పరిశోధనతో పాటు భావోద్వేగంతో నిండిన కోర్ట్ సన్నివేశాలకు రియలిస్టిక్‌గా, ఆకట్టుకునేలా చూపించాడు. డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. ఫైనల్‌గా ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది.






