- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Keerthy Suresh: నెట్టింట వైరల్‌గా మారిన కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి ఎప్పుడంటే?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) వరుస సినిమాలతో తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) వరుస సినిమాలతో తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం ‘బేబీ జాన్’(Baby John) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మహానటి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా స్నేహితుడు ఆంటోనీ(Antony)తో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఇన్స్టాగ్రామ్(Instagram) పోస్ట్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలుపుతూ దీపావళి(Diwali)కి తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ అయిందనడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవల కీర్తి కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతికి వెళ్లారు. ఈ క్రమంలోనే తన పెళ్లి(Wedding) గోవాలో జరగబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డ్(Wedding card) ఫొటో సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 12న మా కూతురి పెళ్లి చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు మీ అందరి అశీర్వాదాలు కావాలి ఇట్లు మీ సురేష్ కుమార్(Suresh Kumar), మేనక అని ఉంది. అయితే కీర్తి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది.
❤️Keerthy & Antony 👩🏻❤️👨🏼Wedding Invitation💍💒 12-12-24 at Goa 😍#Keerthy #Antony #Marriage #Antonythattil #Keerthysuresh #SSMusic pic.twitter.com/Fpny62lyFF
— SS Music (@SSMusicTweet) December 5, 2024






