- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పటి నుంచి ఆ హీరోని అన్నయ్య అని పిలుస్తున్న.. కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్ళిపోయింది. అయితే ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) వంటి సినిమాలకు ఏకంగా అవార్డులు కూడా వరించాయి ఈ బ్యూటీకి.
అయితే టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరుస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్(Bollywood)లో కూడా తన సత్తా చూపెడ్డానికి రెడీ అయింది. అలా అక్కడ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) సరసన ‘బేబీ జాన్’(Baby John) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ ఆశించినంత విజయం అయితే సాధించలేదు. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్(Antony Thatil)తో 15ఏళ్లుగా ప్రేమలో ఉంటూ రీసెంట్‌గా పెళ్ళి(Marriage) కూడా పెళ్లి కూడా చేసుకుంది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి భర్తతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి మాట్లాడుతూ.. ‘నేను చిన్న తనంలోనే హీరో దిలీప్ నటించిన ఓ మూవీలో ఆయన కూతురు పాత్రలో నటించాను. ఇక అప్పటి నుంచి అతన్ని అంకుల్ అని పిలవడం అలవాటైపోయింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే దిలీప్(Dilip) నటించిన ‘రింగు మాస్టర్’(ringu Master) సినిమాలో ఆయన గర్ల్ ఫ్రెండ్‌గా నటించే చాన్స్ వచ్చింది. అయితే ఆ మూవీ షూటింగ్ టైంలో నేను ఎక్కడ తనని అంకుల్ అని పిలుస్తానేమో అని భయపడ్డ దిలీప్ నా దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను అంకుల్ అని పిలవకు కావాలంటే చేటా అంటే అన్నయ్య అని పిలువు అని గట్టిగా చెప్పాడు. దీంతో అప్పటి నుంచి అతన్ని అన్నయ్య అని పిలవడం స్టార్ట్ చేశాను. అంతేకాదు ఎవరికైతే కూతురు పాత్రలో నటించానో మళ్లీ అతని పక్కనే ప్రియురాలుగా నటించడం జరిగింది’ అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






