Keerthy Suresh: భర్తతో కలిసి కీర్తి సురేశ్‌ ఏం చేసిందో చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్‌ అంటే ఇలా ఉండాలి తమ్ముడు

by Vennela |

Keerthy Suresh: సౌత్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేశ్. ఈమధ్యే తాను ప్రేమించిన ఆంటోని తట్టిల్ ను వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ.

Keerthy Suresh: భర్తతో కలిసి కీర్తి సురేశ్‌ ఏం చేసిందో చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్‌ అంటే ఇలా ఉండాలి తమ్ముడు
X

Keerthy Suresh: సౌత్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేశ్. ఈమధ్యే తాను ప్రేమించిన ఆంటోని తట్టిల్ ను వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ.



తాజాగా కీర్తిసురేశ్, ఆంటోని తాటిల్ మొదటి సంక్రాంతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో విజయ్, కల్యాణి ప్రియదర్శన్, మమిత బైజు వంటి ప్రముఖలు కూడా పాల్గొన్న



కొత్త పెళ్ళి కూతురు కీర్తి సురేశ్ తన భర్తతో కలిసి సంక్రాంతి సుంబురాలు వైభవంగా జరుపుకున్నారు. వీరి సంక్రాంతి సెలబ్రేషన్స్ లో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా హాజరయ్యారు.



ఈ ఫొటోలను కీర్తిసురేశ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతిని ఈ జంట ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.



కాగా కీర్తిసురేశ్ పెళ్లి గతేడాది డిసెంబర్ లో ఘనంగా జరిగింది. ఆమె 15ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న తన ప్రియుడు ఆంటోని తట్టిల్ తో డిసెంబర్ 20న గోవాలో సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.




తన చిరకాల స్నేహితుడు ఆంటోని పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన వీరి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.



దీపావళి రోజు ఆంటోనితో తన ప్రేమ గురించి కీర్తి సురేశ్ అందరికీ చెప్పింది. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఈమధ్యే కీర్తి ఇన్ స్టా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగం ఆంటోనితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది.




కాగా ఆంటోని కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తోంది. కొచ్చి , చెన్నైలలో వారికి వ్యాపారాలు ఉన్నాయి. పాఠశాల రోజుల నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లితో వీరిద్దరూ ఒక్కటై జీవితాన్ని ప్రారంభించారు.



ఇక సంక్రాంతి సెలబ్రేషన్స్ కీర్తి సురేశ్ మెరిసిపోయారు. ఎల్లో కలర్ చీరకు పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించారు. మెడలో మంగళసూత్రం..తలలో మల్లెపువ్వులతో కీర్తి అచ్చతెలుగు అమ్మాయిలా ముస్తాబయ్యిందంటూ నెటిజన్లు మురిసిపోతున్నారు.











Next Story