Keerthy Suresh: బోల్డ్ ఓటీటీ సంస్థలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. ప్రమోషన్స్‌తో పాటు గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ

by Chukka Sudharani |   (  Updated:2025-02-04 10:50:18  IST  )

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) బోల్డ్ సిరీస్‌ (Bold series)కు కెరాఫ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Keerthy Suresh: బోల్డ్ ఓటీటీ సంస్థలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. ప్రమోషన్స్‌తో పాటు గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ
X

దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) బోల్డ్ సిరీస్‌ (Bold series)కు కెరాఫ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సెన్సార్‌కు మించిన బోల్డ్ మూవీస్ (Bold movies) ఇందులో స్ట్రీమింగ్‌కు వస్తాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అమెజాన్ ఒరిజినల్స్ చేసిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ (Bollywood) బోల్డ్ బ్యూటీ రాధికా అప్టే (Radhika Apte)తో కీర్తి సురేష్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ అక్క. ఈ సస్పెన్ థ్రిల్లర్ సిరీస్‌ను యష్ రాజ్ ఫిలమ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తు్న్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. దీనిపై అధికారిక ప్రకటన ఇస్తూ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇక టీజర్ విషయానికి వస్తే.. అక్క అనే టైటిల్ రోల్‌ (Title role)లో కీర్తి నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి అక్కడ ఉన్న వారికి చెమటలు పట్టించింది. ‘మాతృస్వామ్యం బలంగా నిలుస్తుంది. ఒక తిరుగుబాటుదారుడు వారి పతనానికి పన్నాగం పన్నాడు. పేర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకుంటుంది. అక్కా త్వరలో వస్తుంది, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే’ అంటూ టీజర్‌ (Teaser)ను రిలీజ్ చేశారు.. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో తెల్ల చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో కీర్తి సురేష్ బోల్డ్ షో చేసింది. అంతే కాకుండా అక్క సిరీస్‌లో తన మెడలో వేసుకున్న భారీ లాకెట్‌తో దర్శనమిచ్చి ప్రమోషన్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నలిచింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story