న్యూ బిగినింగ్స్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి సురేష్.. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-01-12 06:29:56  IST  )

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

న్యూ బిగినింగ్స్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి సురేష్.. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌‌(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. ‘2025 సంచిక ఆలస్యంగా పూర్తి చేసుకున్నాను, ఈ అందమైన సంవత్సరాన్ని 20 స్లయిడ్‌లలో తీసుకురావడం అంత సులభం కాదు.. నోట్: 2026ని కృతజ్ఞతతో, ​​ఉత్సాహంగా మరియు రాబోయే ప్రతిదానికీ సిద్ధంగా ఉన్న భావనతో ప్రారంభించడం’ అనే క్యాప్షన్ జోడించింది.

అయితే ఆమె షేర్ చేసిన ఫొటోలో విజయ్ దేవరకొండతో దిగిన ఫొటో షేర్ చేసి దానికి న్యూ బిగినింగ్స్ అనే క్యాప్షన్ జోడించడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సినిమా మంచి విజయం సాధించాలని బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా విజయ్-కీర్తి సురేశ్ జంటగా ‘రౌడీ జనార్దన్‌’ అనే మూవీలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి రవికిరణ్‌ కోల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Next Story