Keerthi Suresh: ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఒక్కదానితోనే సరిపెట్టుకుంటున్న బ్యూటీ

by Pulgam srinivas |

కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలోనే మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో విజయాన్ని, గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె ఎన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించినా ఆ స్థాయి విజయం దక్కలేదు.

Keerthi Suresh: ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఒక్కదానితోనే సరిపెట్టుకుంటున్న బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ సినిమాల ద్వారా కెరీర్ను మొదలుపెట్టి, తెలుగు సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా ఈ హీరోయిన్కి నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు రావడం మొదలైంది. అందులో భాగంగా కీర్తి నటించిన నేను లోకల్ చిత్రం కూడా మంచి ప్రశంసలను అందుకుంది.

మంచి నటిగా కెరీర్ ప్రారంభంలోనే గుర్తింపును సంపాదించుకున్న ఈమెకు మహానటి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఈమె నటించిన మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో, ఇందులో తన నటనతో ప్రేక్షకుల మనుసులను దోచుకోవడంతో ఒక్కసారిగా కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ కి వరుసగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల నుండి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో అవకాశాలు రావడం మొదలైంది.

ఈమె కూడా ఈ చిత్రం తర్వాత అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలో నటించింది. కానీ ఈమెకు ఇప్పటివరకు మహానటి చిత్రం తర్వాత ఒక్క లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. అయినా ఇప్పటికీ కూడా ఈమెకు మహిళా ప్రాధాన్యత చిత్రాలలో అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తుంది.

Next Story