Keerthy Suresh: ‘ఫస్ట్ టైమ్ ఇక్కడికి వచ్చాను.. నా ఎగ్జైట్‌మెంట్‌ను దాచుకోలేకపోతున్నాను!

by Kodari Anjali |

టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ

Keerthy Suresh: ‘ఫస్ట్ టైమ్ ఇక్కడికి వచ్చాను.. నా ఎగ్జైట్‌మెంట్‌ను దాచుకోలేకపోతున్నాను!
X

దిశ, వె‌బ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ (Keerthy Suresh) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ గీతాంజలి (Gitanjali) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ అమ్మడు అద్భుతమైన నటన వీక్షించిన దర్శక, నిర్మాతలు వరుస అవకాశాలు ఇచ్చారు.

రింగ్ మాస్టర్(ring master), దర్బోని, ఇదు ఎన్నమాయం, నేను శైలజ (Nenu shailaja), రెమో, బైరవా, నేను లోకల్, మహానటి, అజ్ఞాతవాసి, సర్కార్(Sarkar), మిస్ ఇండియా(Miss India), రంగ్ దే, సర్కారు వారి పాట, దసరా, భోలా శంకర్, రఘు తాత వంటి తెలుగు, హిందీ, మలయాళం, తమిళం చిత్రాల్లో నటించి సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది.

ఈ బ్యూటీ ఇటీవలే బేబీ జాన్ (Baby John) చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టి.. తన సత్తా చాటుతుంది. కీర్తి సురేష్ సినిమాల విషయం పక్కన పెడితే.. మూడు నెలల కిందట ప్రియుడు ఆంటోని(Antony)తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరు కుటుంబ సభ్యుల ఒప్పందంతో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో (Christian traditions) పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ నటి అటు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా రాణిస్తుంది.

భర్తతో కలిసి అదిరిపోయే ఫొటో షూట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికన తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏదో ఒక పోస్ట్‌తో అండ్ ఇన్‌స్టా స్టోరీలో తనకు సంబంధించిన హ్యాపీ మూమెంట్స్‌ను పంచుకుంటుంది.

తాజాగా ఈ మహానటి కోలంబో వెళ్లిన్నట్లు ఇన్‌స్టా స్టోరీలో తెలియజేసింది. చేతిలో పాస్‌పోర్ట్ పట్టుకుని దిగిన ఫొటో ఒకటి స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘ నేను కోలంబో వచ్చాను. ఫస్ట్ టైమ్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జైట్‌మెంట్‌ను దాచుకోలేకపోతున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story