- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో పిల్లాడితో దర్శనమిచ్చిన కీర్తి సురేష్.. క్యూట్‌గా ఆడిపిస్తోన్న వీడియో వైరల్
నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అద్భుత నటి కీర్తి సురేష్ (Keerthy Suresh).

దిశ, వెబ్‌డెస్క్: నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అద్భుత నటి కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్, అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకుంది. సినీ పరిశ్రమలో అలాగే తెలుగు ప్రజల్లో మహానటిగా పేరు సంపాదించుకుంది. ఏకంగా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనే నటించే చాన్స్ దక్కించుకుంది.
మెగాస్టార్ కు చెల్లెల్లిగా భోళా శంకర్ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే సీనియర్ స్టార్ హీరో సూపర్ ్టార్ రజనీకాంత్‌కు సోదరిగా నటించి జనాలకు కన్నీళ్లు పెట్టించింది. వీటితో పాటుగా నేను లోకల్, మిస్ ఇండియా, మహానటి, రంగ్ దే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. మంచి పేరు దక్కించుకుంది. ఇటు టాలీవుడ్‌లో దూసుకుపోతూనే ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్‌లో కూడా అవకాశం దక్కించుకుంటుంది.
తొలి మూవీతోనే బాలీవుడ్ ప్రముఖ హీరోవరుణ్ ధావన్ సరసన అవకాశం కొట్టేసింది. వీరి జోడితో తెరకెక్కిన బేబీ జాన్ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇటు సినిమాల్లో అవకాశం దక్కించుకుంటూనే అటు మరోవైపు ప్రియుడ్ని వివాహం చేసుకుని మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ క్యూట్ వీడియో పంచుకుంది. ఈ వీడియో చూస్తుంటే కీర్తి ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాబుతో క్యూట్ గా మాట్లాడుతూ.. నవ్విస్తూ ఆడిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






