- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఎల్లమ్మ’లో హీరోగా దేవిశ్రీ ప్రసాద్.. హీరోయిన్ ఎవరో తెలిసా?
‘బలగం’ ఫేమ్ డైరెక్టర్ వేణు.. ఇప్పుడు తన రెండో సినిమాపై స్పీడ్ పెంచాడు.

దిశ, సినిమా: ‘బలగం’ ఫేమ్ డైరెక్టర్ వేణు.. ఇప్పుడు తన రెండో సినిమాపై స్పీడ్ పెంచాడు. 2023లో ప్రకటించిన ‘ఎల్లమ్మ’ అనే చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుండగా.. ఇప్పటి వరకు నటుల విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే మొన్నటి వరకు ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు రాగా.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా కన్ఫర్మ్ అయినట్లు టాలీవుడ్ ఫిలిమ్ వర్గాల నుంచి గట్టిగా టాక్ వినిపిస్తుంది.
అంతే కాకుండా.. ఆల్మోస్ట్ DSP ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ కాగా.. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. నితిన్ హీరోగా అనుకున్నప్పుడు కూడా ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరే వినిపించగా.. ప్రాజెక్ట్ నుంచి కీర్తి తప్పుకుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఫైనల్‌గా హీరోగా దేవిశ్రీ ప్రసాద్, హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఫైనల్ చేశారట మేకర్స్. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. లింక్






