- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KEERTHY BHAT: కీర్తి అందుకే నన్ను వదిలేసింది.. బ్రేకప్‌పై కార్తీక్ ఎమోషనల్ వీడియో
సీరియల్ నటి, బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ తన ప్రియుడు కార్తీక్ తో బ్రేకప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ విషయంపై కార్తీక్ స్పందించారు. కీర్తి పోస్ట్ పెట్టిన తరవాత తనకు చాలా మంది ఫోన్ చేసి కీర్తిని వదిలేయవద్దని అడుగున్నారని చెప్పాడు.

దిశ, వెబ్ డెస్క్: సీరియల్ నటి, బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ తన ప్రియుడు కార్తీక్ తో బ్రేకప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ విషయంపై కార్తీక్ స్పందించారు. కీర్తి పోస్ట్ పెట్టిన తరవాత తనకు చాలా మంది ఫోన్ చేసి కీర్తిని వదిలేయవద్దని అడుగున్నారని చెప్పాడు. తను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని కానీ తనే విడిపోవాలని అనుకుందని చెప్పాడు. ఈ ఏడాది ఆమెను పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని తను, తన కుటుంబం కోరుకున్నామని అన్నాడు. తాను ఇంకా ఆర్థికంగా స్థిరపడలేదు అనే కారణం ఆమెకు నచ్చలేదని చెప్పాడు.
డిసెంబర్ లోనే ఈ విషయం చెప్పి కీర్తి తన లైఫ్ తాను చూసుకుంటుందని అన్నాడు. ఎవరి జీవితం వాళ్లది కాబట్టి నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు కూడా ఉంటుందని కార్తీక్ చెప్పాడు. ఈ క్రమంలో ఆయన ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా కార్తీక్, కీర్తి రిలేషన్ షిప్ లో ఉన్నారు. కీర్తి బిగ్ బాస్ షోకు వచ్చిన సమయంలో తన ప్రియుడుగా కార్తీక్ ను పరిచయం చేసింది. 2023లోనే వీరిద్దూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తరవాత అంతా వీరు పెళ్లి చేసుకుంటారని అనుకుంటే బ్రేకప్ ప్రకటన చేసి బిగ్ బాస్ బ్యూటీ అందరికీ షాక్ ఇచ్చింది.






