- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ముందు దాన్ని ఎత్తు.. లోపల పెట్టు..’ ఇదేం సాహిత్యంరా సామీ.. పిల్లలు అర్థమడిగితే పరిస్థితి ఏంటి??
‘కేడీ - ది డెవిల్’ అనే సినిమా నుంచి హిందీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. దానిని వింటే పాట వింటున్నానా బూతులు వింటున్నానా అనే అనుమానం రాకతప్పదు.

దిశ, ఫీచర్స్ : తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ.. భాష ఏదైనా సాహిత్యాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టుకుంటరు. తమ తమ సాహిత్యాన్ని గౌరవిస్తుంటారు. ముఖ్యంగా సినిమా విషయాలకు వస్తే 60, 70లలో ఉన్న సాహిత్యాన్ని 80, 90లలో చూడలేము. ఎంతో కొంత జనాలకు అనువుగా, అర్థమయ్యేలా పాటలు రాశారు మన లిరిసిస్ట్‌లు. ఇక 2000, 2010, 2020లలో వచ్చే సరికి ధూమ్ ధామ్ తప్ప ఏమీ ఉండదు. ఎక్కడో ఒక్క చుక్క మెరిసినట్లుగా తప్ప ఏ పాటలోనూ అసలు సాహిత్యాన్ని చూడలేము. ఇగ ఇప్పుడు అయితే పాటలన్నీ వల్గర్‌గానే ఉంటున్నయి. ముఖ్యంగా మాస్ మసాలా సాంగ్ అంటూ బెడ్ రూమ్‌లో జరిగే శృంగార సన్నివేశాలను సాహిత్యం పేరుతో బూతులు పెట్టేస్తున్నారు. అసలు లిరిసిస్ట్ అనే పదానికే తల ఒంపులు తెస్తున్నారు.
తాజాగా ‘కేడీ - ది డెవిల్’ అనే సినిమా నుంచి హిందీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. దీని లిరిక్స్ చూస్తే మైండ్ పోయింది. నేను పాట వింటున్నానా బూతులు వింటున్నానా అనేంత పని అయిపోయింది చాలా మందికి. ఇంతకీ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తే ఏముందో చూడండి.. ‘ముందు దాన్ని ఎత్తు.. లోపల పెట్టు.. ఒక్క బొట్టు కూడా కింద పడనీయకు.. ఖాళీ అయ్యాక బయటకు లాగు..’ ఏంది ఇది సాహిత్యమా లేక కామం కళ్లకెక్కిన వ్యక్తి మాట్లాడటమా? దీనికి లిరిక్ సాంగ్ అని రిలీజ్ చేసే బదులు.. బ్లూ ఫిల్మ్ అని ఏకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే బాగుండదనేది నెటిజన్ల అభిప్రాయం. అభిప్రాయమనే బదులు పొట్టు పొట్టు తిడుతున్నారని చెప్పడం బెటర్.
ఇదంతా కాదు.. అసలు ఈ పాట రాసిన ఆ వ్యక్తికి.. పాడిన మనిషికి.. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్టులు.. వీరెవ్వరికి ఇది కరెక్ట్ కాదు అనిపించలేదా? సరే వాళ్ల సినిమాను ఇదే బూతుతో జనాల్లోకి తీసుకుపోదామని సప్పుడేక ఊర్కున్నారని అనుకుందాం.. చిన్న చిన్న మాటలకే బీప్‌లు వేయండి.. సీన్లు కట్ చేయండి.. అని చెప్పే సెన్సార్ బోర్డుకు ఏమైంది.. చెవులు లేవా? బుద్ధి, జ్ఞానం లేదా? అనేది నెటిజన్ల తిట్ల పురాణం. ఇలాంటి పాటను పిల్లలు, టీనేజర్స్ వింటే.. ఆ పాట అర్థమేంటని తల్లిదండ్రులను అడిగితే.. ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ ఇలాగే ఈ పాటను వదిలారనుకోండి.. రేపటి నుంచి కచ్చితంగా రీల్స్‌తో బూతు ప్రభంజనం ఖాయం.






