- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పాత్రను చూసి నిజంగా షాక్ అవుతారు.. ది ప్యారడైజ్ సినిమాపై కయ్యదు లోహార్ కామెంట్స్
ది ప్యారడైజ్ సినిమాలో ఇప్పటి వరకు చూడని పాత్రలో నన్ను చూస్తారు అంటుంది హీరోయిన్ కయ్యదు లోహార్.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ‘దసరా’ బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కలయికలో వచ్చే ఈ ప్రాజెక్టు కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. తాజాగా హీరోయిన్‌ను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా కయ్యదు లోహార్ పుట్టినరోజు సందర్భంగా.. నాని ఆమెకు విషెస్ తెలుపుతూ ఇందులో కయ్యదు ‘సుబ్బలక్ష్మి’ అనే పాత్రలో నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ ‘ది ప్యారడైజ్’లో తన పాత్రపై మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను పోషిస్తున్న పాత్ర, ఇంతకుముందు చేసిన పాత్రలన్నింటికీ పూర్తిగా భిన్నమైనది. నా వేషధారణ నుండి నా పాత్ర తీరు వరకు.. ఈ సినిమాలో ఆ పాత్రలో నన్ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, నన్ను ఇలా ఊహించి ఉండరని నేను భావిస్తున్నాను. కాగా షూటింగ్ శరవేంగా జరుపుకుంటున్న ఈ ఇంటెన్స్ డ్రామా ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కానుంది.






