Kayadu Lohar: జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా బ్యూటీ

by Chukka Sudharani |

యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ (Kayad Lohar) ‘డ్రాగన్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

Kayadu Lohar: జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా బ్యూటీ
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ (Kayad Lohar) ‘డ్రాగన్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ తమిళ (Tamil) స్టార్ హీరో సిలంబరసన్ (సింబు) నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘STR- 49’లో కయాదు కూడా భాగమైంది. ఈ సినిమాలో ఈ హీరోయిన్ నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) కూడా ఇచ్చేశారు చిత్ర బృందం. ఇప్పుడు ఈ బ్యూటీ మరో రెండు బిగ్గెస్ట్ ఆఫర్లు (Two biggest offers) అందుకున్నట్లు తెలుస్తుంది. నేచురల్ స్టార్ నాని (Nani) రీసెంట్‌గా ‘హిట్-3’తో హిట్ అందుకుని ఇప్పుడు.. ‘ది ప్యారడైజ్’ (The Paradise)తో బిజీగా ఉన్నాడు.

శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ పాన్ ఇండియా (India) సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దీనిని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించే నటీనటులపై మాత్రం ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా హీరోయిన్ ఫిక్స్ అయినట్లు ఫిలీమ్ వర్గాల నుంచి సమాచారం. ‘ది ప్యారడైజ్’లో కయాదు లోహర్ హీరోయిన్‌గా దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ నటుడు జీవీ ప్రకాష్ (G.V. Prakash) సినిమాలో కూడా ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story