- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kayadu Lohar : మరో బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్న కయాదు లోహర్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వైరల్
కోలీవుడ్ (Kollywood) యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) ‘డ్రాగన్’ (Dragon) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) ‘డ్రాగన్’ (Dragon) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అందులో లోహర్ నటన, అందానికి ప్రేక్షకులు ఫిదా కావడంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి ప్రజెంట్ వరుస ఆఫర్లు అందుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగులో విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమాలో నటిస్తున్నట్లు టాక్. అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కయాదును హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఇది ఇలా హోల్డ్‌లో ఉండగానే.. లోహర్ మరో బిగ్గెస్ట్ ఆఫర్ అందుకుంది.
తమిళ స్టార్ హీరో సిలంబరసన్ (Silambarasan) (సింబు) తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘STR- 49’తో బిజీగా ఉన్నాడు. కార్తిక్ థంగావెల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు రాగా.. తాజాగా వాటిని నిజం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది చిత్ర బృందం. ఈ మేరకు కయాదును STR- 49లోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ప్రకటించారు.
Welcoming the leading lady of #STR49 - @11Lohar ❤️
— DawnPictures (@DawnPicturesOff) April 27, 2025
Elated to have her onboard the project🩷
More updates on the way🧨🔥@SilambarasanTR_ @AakashBaskaran @ImRamkumar_B @SaiAbhyankkar pic.twitter.com/1n73KqXTMF






