బలగం బ్యూటీ డిఫరెంట్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న వరుస ఫొటోలు..?

by Kodari Anjali |

బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

బలగం బ్యూటీ డిఫరెంట్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న వరుస ఫొటోలు..?
X

దిశ, వెబ్‌డెస్క్: బలగం (Balagam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆ తర్వాత మసూద, ఉస్తాద్ లాంటి చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ బ్యూటీ జబర్దస్త్ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం చిత్రం మంచి విజయం సాధించి.. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా తెరకెక్కి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి.. క్యూట్ క్యూట్ మాటలతో జనాల్ని ఆకట్టుకుంది. స్నేహమంటే ఇదేరా, గంగోత్రి (Gangotri), ఠాగూర్ (Tagore), అడవి రాముడు, బాలు (Balu), విజయేంద్ర వర్మ (Vijayendra Varma), సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose), పాండు రంగడు (Pandu Ranga), ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాలలో బాలనటిగా మంచి పేరు సంపాదించుకుంది. కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మార్చి నెలలో గడిపిన క్షణాల్ని సోషల్ మీడయా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ప్రతి ఒక ఫొటోను షేర్ చేస్తూ.. ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘ మార్చి నెల చాలా లవ్‌లో నిండిపోయింది’ అని క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ బలగం బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story