- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavya Kalyan Ram: హీరోయిన్‌గా మరో కొత్త సినిమా ప్రకటించిన చైల్డ్ ఆర్టిస్ట్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ రామ్ (Kavya Kalyan Ram).. బలగం చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ రామ్ (Kavya Kalyan Ram).. బలగం చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు, మూడు చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు సిద్ధం అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా స్టార్ట్ కాగా.. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ అందమైన ప్రేమకథ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కుంచం శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. టిడి దినకరన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. TDR సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్-1గా రూపొందుతోన్న ఈ మూవీలో కావ్య కల్యాణ రామ్, పావం కేసరి జంటగా నటిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమాకు ముఖ్య అతిథులుగా హాజరైన యువ దర్శకులు రామ్ అబ్బరాజు, దిమ్మలప్రశాంత్, నిర్మాత విజయ్‌పాల్ రెడ్డి ఎ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. లింక్






