ప్రెగ్నెన్సీ ప్రకటించిన కత్రినా కైఫ్...బేబీ బంప్ తో ఫోటో

by velandi.Saikiran |   (  Updated:2025-09-23 07:56:57  IST  )

ప్రెగ్నెన్సీ ప్రకటించిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్..ఈ మేర‌కు పోస్ట్ పెట్టారు.

ప్రెగ్నెన్సీ ప్రకటించిన కత్రినా కైఫ్...బేబీ బంప్ తో  ఫోటో
X

దిశ‌, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరో జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ మేరకు శుభవార్త చెప్పారు. త్వరలోనే అందాల తార కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కత్రినాలతో పాటు ఆమె భర్త విక్కీ కౌశల్... సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. మా జీవితాల్లోకి బెస్ట్ చాప్టర్... ను ప్రారంభించబోతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు హీరోయిన్ కత్రినా కైఫ్ బేబీ బంప్ తో ఉన్న ఫోటోను కూడా... షేర్ చేశారు విక్కీ కౌశల్. దీంతో ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు... కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా 2021లో... కత్రినా కైఫ్ అలాగే విక్కీ కౌశల్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.




Next Story