- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మే' లక్ష్యంగా కరుప్పు
సూర్య హీరోగా తెరకెక్కుతున్న కరుప్పు చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు సూర్య ప్రస్తుతం కరుప్పు చిత్రంలో నటిస్తున్నాడు. త్రిష ఇందులో హీరోయిన్‌గా కనిపించనుండగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. మే రెండవ వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. చిత్రబృందం అనుకున్న విడుదల తేదీ దగ్గర పడడంతో వేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు.
-ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వసిక, శివద, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాయి అభ్యాంకర్ సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జికె విష్ణు, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు.
ఈ చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలలో సూర్య మాస్ లుక్‌లో కనిపించాడు. దాంతో ఈ మూవీ ద్వారా చాలా కాలం తర్వాత సూర్యకు మంచి మాస్ హిట్ వస్తుందని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.






