- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈరోజు నుండి థియేటర్లలో ‘కరుప్పు’.. సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
కరుప్పు చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన ‘కరుప్పు’ చిత్రాన్ని నిన్న, అనగా మే 14వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతా ఓకే అయ్యి ఈ సినిమాకు సంబంధించిన షోలు పడతాయని అనుకునేలోపే, ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని, ఆ సమస్యలు పరిష్కారం కావడానికి కొంత సమయం పడుతుందని సమాచారం వచ్చింది. దాంతో ఈ సినిమా మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అయినట్లు అప్డేట్ వెలువడింది. ఈ వార్తతో సూర్య అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు.
కనీసం ఫస్ట్ షోకైనా సినిమా ప్రదర్శన ప్రారంభమవుతుందని ఎంతో మంది భావించారు. కానీ నిన్న ఈ సినిమా షోలు ప్రదర్శించబడలేదు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. సాయి అభ్యంకర్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించారు.






