‘కరుప్పు’ బ్లాక్ బస్టర్ హిట్.. సినిమాటోగ్రాఫర్‌కు సూర్య బిగ్ సర్‌ప్రైజ్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్!

by Mallepaka Hamsa |

సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకి సూర్య ఒక ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. మహీంద్రా బి6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారును సూర్య చేతుల మీదుగా అందుకున్నారు.

‘కరుప్పు’ బ్లాక్ బస్టర్ హిట్.. సినిమాటోగ్రాఫర్‌కు సూర్య బిగ్ సర్‌ప్రైజ్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ అందుకోలేకపోయారు. అయితే, ఇటీవల సూర్య- ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘కరుప్పు’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా ఏళ్ల తర్వాత ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ అద్భుతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 300 కోట్ల వసూళ్ల మార్కును దాటేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతో సూర్య ఖాతాలో సాలిడ్ హిట్ పడింది. ఈ భారీ విజయం ఇచ్చిన ఆనందంలో హీరో సూర్య చిత్ర యూనిట్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ సినిమాలో తనను ఎంతో స్టైలిష్‌గా, అద్భుతంగా చూపించినందుకు గానూ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకి సూర్య ఒక ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. మహీంద్రా బి6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారును సూర్య చేతుల మీదుగా అందుకున్న జీకే విష్ణు.. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కారు మార్కెట్ ఖరీదు సుమారు రూ. 30 నుండి 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. సినిమాటోగ్రాఫర్ విష్ణు పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం సినిమాటోగ్రాఫర్‌కే ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇస్తే.. ఇక సినిమాకు కథను అందించి, సూర్యకు అంతటి భారీ హిట్‌ను కట్టబెట్టిన దర్శకుడు ఆర్జే బాలాజీకి ఇంకెంత ఖరీదైన బహుమతి ఇస్తారో అని ఫ్యాన్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి సూర్య చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story