- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karunakaran: ప్రభాస్ సెట్స్‌లో ఉంటే పండగే.. ఆయన క్యారవన్‌లో ఉండే హీరో కాదు
కరుణాకరన్ మాట్లాడుతూ… ప్రభాస్ క్యారవాన్‌లో ప్రైవేట్‌గా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడరని, దాంతో ఆయన సెట్స్‌లో ఉన్న రోజంతా అక్కడ పండగ వాతావరణం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన డార్లింగ్ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాను 2010లో విడుదల చేశారు. ఆ సమయంలో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఈ మూవీకి రీ-రిలీజ్‌లో భాగంగా మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా ఈ మూవీ దర్శకుడు కరుణాకరన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
కరుణాకరన్ మాట్లాడుతూ… ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన సెట్స్‌లో ఉంటే అక్కడ పండగ వాతావరణం నెలకొంటుందని తెలిపారు. అందుకు కారణం ఆయన డైరెక్టర్లకు, అసిస్టెంట్ డైరెక్టర్లకు మరియు సెట్ బాయ్స్‌కు అందరికీ మంచి భోజనం పెడతారని మాత్రమే కాదు, షూట్ డిస్కషన్ అయినా, సీన్ డిస్కషన్ అయినా ఆయన చుట్టూ అందరూ ఉంటారని, ఆయన క్యారవాన్‌లో ప్రైవేట్‌గా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడరని తెలిపారు. అందరితో కలిసి సరదాగా నవ్వుతూ ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారని, దాంతో ఆయన సెట్స్‌లో ఉంటే, ఆ రోజు అక్కడ ఉన్న వారందరూ పండగ వాతావరణంలా ఫీల్ అవుతుంటారని కరుణాకరన్ పేర్కొన్నారు. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.






