కొత్త సినిమా ప్రకటిస్తూ కార్తీక్ ఆర్యన్ షాకింగ్ పోస్ట్..వణుకుపుట్టిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) గత ఏడాది భూల్ భూలయ్యా-3(Bhool Bhulayya-3), చందు చాంపియన్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు.

కొత్త సినిమా ప్రకటిస్తూ కార్తీక్ ఆర్యన్ షాకింగ్ పోస్ట్..వణుకుపుట్టిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) గత ఏడాది భూల్ భూలయ్యా-3(Bhool Bhulayya-3), చందు చాంపియన్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అషికి-3’(Aashiqui-3). ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, కార్తీక్ ఆర్యన్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ‘నాగిల్లా’ (𝐍𝐚𝐚𝐠𝐳𝐢𝐥𝐥𝐚)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ మూవీని మ్రిగ్‌దీప్ సింగ్ లంబా(Mrigdeep Singh Lamba) తెరకెక్కిస్తున్నారు.

దీనిని ధర్మా ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై మహావీర్ జైన్, మ్రిగ్‌దీప్ సింగ్ లంబా, సుజిత్ జైన్, కరణ్ జోహార్(Karan Johar), అదార్ పూర్ణవాలా, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది నాగపంచమి నాడు ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుందని వెల్లడించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘‘మానవుడు చాలా అందంగా ఉంటాడు. కానీ దుర్మార్గుడు చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక ఈ పోస్టర్‌లో కార్తీక్ ఆర్యన్ బాడీ మొత్తం పాములు చుట్టుకొని ఉండగా.. ఆయన వీపుపై పాము చర్మంలా మారిపోయింది. ఆయన నిల్చొని ఉండగా.. మొత్తం నాగు పాములు గుహలా చుట్టుకుని ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్‌ను తెప్పిస్తోంది. ఇక ఇది చూసిన నెటిజన్లలో ఫస్ట్ లుక్ ఇలా ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Next Story