Nirupam Paritala: పబ్లిక్‌లో భార్యతో అలా చేసిన డాక్టర్ బాబూ.. మామూలోడు కాదంటూ నెటిజన్ల కామెంట్స్

by Phanindra |

బీచ్‌లో రొమాంటిక్ ఫోజులతో ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు

Nirupam Paritala: పబ్లిక్‌లో భార్యతో అలా చేసిన డాక్టర్ బాబూ.. మామూలోడు కాదంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు ( Nirupam Paritala ) గురించి బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ లో నిరూపమ్ పరిటాల స్టార్స్‌తో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు, సీరియల్స్‌తో ఫుల్ బిజీ అయ్యాడు. తన అద్భుతమైన నటనతో ఫ్యామిలీ ప్రేక్షకుల చేత బుల్లితెర శోభన్ బాబు అని పిలిపించుకున్నాడు. సీరియల్స్‌తో పాటు పలు షోలు, ఈవెంట్స్ కూడా చేస్తూ రెండు చేతుల నుంచి సంపాదిస్తున్నాడు.

కార్తీక దీపంకు ( Karthika Deepam ) ముందు ఎన్నో సీరియల్స్‌లో చేశాడు, కానీ సరయిన గుర్తింపు రాలేదు. ఈ ఒక్క సీరియల్ తర్వాత మొదటి స్థానంలోకి వెళ్ళాడు దాంతో పాటు రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశాడు. గతంలో ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 25 వేలు తీసుకునే ఆయన.. ఇప్పుడు రూ. 40 నుంచి రూ.45 వేలు చొప్పున ఛార్జ్ చేస్తున్నాడని తెలిసిన సమాచారం.

షూటింగ్స్ లేని సమయంలో కుటుంబంతో గడుపుతుంటాడు. వీలున్నప్పుడల్లా ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ కి వెళ్తుంటాడు. ఇక తాజాగా, తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ బీచ్‌లో రొమాంటిక్ ఫోజులతో ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇవి కాస్తా వైరల్ గా మారాయి. " పోజ్ పెట్టటానికి ఇది టైటానిక్ కాకపోవచ్చు కానీ రిఫ్రెష్ కావడానికి ఈ ట్రిప్ ఒక టానిక్. ఒకసారి ట్రై చేసి చూడండి " అని నిరుపమ్ పోస్ట్ లో రాసుకొచ్చాడు. వీటిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ లో " మీ సూపర్ జోడి సూపర్ " అని కొందరు , " మా డాక్టర్ బాబు మామూలోడు" ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story