- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్
ఇండిపెండెంట్ ఫిల్మ్‌పై దృష్టి పెట్టిన కార్తీక్ సుబ్బరాజ్.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు. ఈయన కొంతకాలం క్రితం సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపొందిన ‘రెట్రో’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా విడుదలై చాలాకాలం అయినప్పటికీ, కార్తీక్ సుబ్బరాజ్ తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆయన నెక్స్ట్ చిత్రం ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి ఆయన అభిమానుల్లో నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజ్ తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్‌పై పని చేస్తున్నట్లు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఈ చిత్రాన్ని ముందుగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించాలనే ప్రణాళికలో ఉన్నట్లు, ఆ తర్వాత ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. ఈ తాజా ప్రకటనతో ఈ క్రేజీ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.






