- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి కార్తి కొత్త సినిమా.. రేపట్నుంచే స్ట్రీమింగ్
కార్తీ - కృతిశెట్టి జంటగా నటించిన అన్నగారు వస్తారు (వా వాతియార్) సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: కార్తీ - కృతిశెట్టి జంటగా నటించిన అన్నగారు వస్తారు (వా వాతియార్) సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో జనవరి 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఎన్నో ఒడుదుడుకుల తర్వాత సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎన్ని కలెక్షన్లు వచ్చాయన్న దానిపై అధికారిక సమాచారం లేదు.
స్టోరీ విషయానికొస్తే.. రెగ్యులర్ స్టోరీ లైన్ గానే కనిపిస్తుంది. దివంగత నటుడు ఎంజీఆర్ కు రాజ్ కిరణ్ వీరాభిమాని. ఆయన మరణించిన రోజునే మనవడు పుట్టడంతో.. ఆయనలాగే పెంచాలని రామేశ్వరన్ (కార్తి) అని పేరు పెట్టుకుంటాడు. నిజాయతీకి మారుపేరుగా పెంచాలనుకుంటే అందుకు భిన్నంగా పెరుగుతాడు. ఎంతో కష్టపడి పోలీసుని చేస్తే.. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి లంచాలు తీసుకుంటుంటాడు. ఓ సమయంలో ఎన్కౌంటర్ చేయాల్సి రాగా.. అప్పుడు తన మనవడి నిజస్వరూపం రాజ్ కిరణ్ కు తెలుస్తుంది. ఆ బాధతో అతను చనిపోతాడు. తాత మరణం తర్వాత రామేశ్వరన్ ఎలా మారాడు? ఏం జరిగింది? అన్నదే తర్వాతి స్టోరీ.






