- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్ స్వింగ్‌లో ‘కార్తి-30’ షూటింగ్.. బర్త్ డే స్పెషల్‌గా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన మేకర్స్
నేడు హీరో కార్తి పుట్టినరోజు కావడంతో, ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన చేసిన చిత్రాలు ఊపిరి, హిట్-3, వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను తెచ్చుకుని భారీ కలెక్షన్లే రాబట్టాయి. ఇక ఇప్పుడు కార్తి మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. నేడు హీరో కార్తి పుట్టినరోజు కావడంతో, ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. కార్తి పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మార్చేందుకు ‘కార్తి-30’ చిత్రబృందం అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమైనట్లు అనౌన్స్ చేశారు. బర్త్‌డే ట్రీట్‌తో పాటు చిత్రబృందం మరో క్రేజీ హింట్ ఇచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్, పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కళ్యాణ్ శంకర్ మార్క్ కామెడీ టైమింగ్, కార్తి యాక్షన్ పర్ఫార్మెన్స్ తోడవుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కార్తీ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయే ఈ 30వ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కార్తి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. లండన్‌లో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో మీనాక్షి చౌదరి వైట్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి ట్రెడిషనల్ లుక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.






