‘కార్తి-29’ హీరోయిన్ ఫిక్స్.. షూటింగ్‌ కోసం ఆ ఆలయంలో భారీ సెట్ వేసిన మేకర్స్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-24 14:41:53  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ శివకుమార్(Karthik Shivakumar) గత ఏడాది ‘సత్యం సుందరం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

‘కార్తి-29’ హీరోయిన్ ఫిక్స్.. షూటింగ్‌ కోసం ఆ ఆలయంలో భారీ సెట్ వేసిన మేకర్స్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ శివకుమార్(Karthik Shivakumar) గత ఏడాది ‘సత్యం సుందరం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీ అయిపోయారు. ఆయన నటిస్తున్న చిత్రాల విషయానికొస్తే.. ఖైదీ-2(Khaidi 2), వా వాతియార్, హిట్-4 వంటి సినిమాలు చేస్తున్నారు. అలాగే ఆయన తమిజ్ దర్శకత్వంలో ‘కార్తి-29’ మూవీ చేయనున్నారు. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై దీనిని ఇషాన్ సక్సేనా, సునీల్ షా(Sunil Shah), రాజా సుబ్రమణ్యం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల అయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘కార్తీ-29’ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో చిత్రబృందం భారీ సెట్‌ను వేసినట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కార్తీ సరసన కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) నటించనుండగా.. వడివేలు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. కార్తి నటిస్తున్న ‘వా వాతియార్’ షూటింగ్ మరో 10 రోజుల్లో కంప్లీట్ కానుండగా.. నెక్ట్స్ ఆయన ఈ సినిమా షూట్‌లో జాయిన్ కానున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఖుషీ అవుతున్నారు

Next Story