Kareena Kapoor : నటి కన్నీటి పోస్ట్.. కారణం ఇదే!

by Muthe.Rajitha |

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై ఈనెల 16న ఓ దుండగుడు దాడి జరిపిన విషయం తెలిసిందే.

Kareena Kapoor : నటి కన్నీటి పోస్ట్.. కారణం ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై ఈనెల 16న ఓ దుండగుడు దాడి జరిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సైఫ్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రి(Leelavathi Hospital)లో చికిత్స పొందుతున్నాడు. కాగా సైఫ్ పై వస్తున్న ఫేక్ వార్తలు, పుకార్ల నేపథ్యంలో అతని భార్య కరీనా కపూర్(Kareena Kapoor) ఆవేదన వ్యక్తం చేశారు. "దయచేసి ఇలాంటివి ఆపండి, ప్లీజ్ మమ్మల్ని ఇక వదిలేయండి" అంటూ కన్నీటి పోస్ట్ పెట్టారు. అయితే కొద్దిసేపటి తరువాత కరీనా తన పోస్టును తొలగించింది. అయితే ఈ దాడికి సంబంధించి ఈ చానల్ సృష్టించిన వీడియోను ఓ నటుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. కరీనా పై విధంగా స్పందించారు. మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్స్ ఊహాజనిత వార్తలకు దూరంగా ఉండాలని దాడి జరిగిన రోజున కరీనా ఓ పోస్ట్ పెట్టగా.. ఘటనపై పలు పుకార్లు షికార్లు చేస్తుండటంతో కరీనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story