- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kareena Kapoor: ‘‘ఇతరుల కంటే మనమే తెలివైనవాళ్లమని అనుకుంటాం’’.. కానీ: అగ్ర నటి సెన్సేషనల్ పోస్ట్
బాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవచ్చు. రొమాంటిక్ కామెడీ చిత్రాల నుంచి ఎన్నో క్రైం డ్రామాల మూవీల వరకు అనక రకాల సినిమాలు చేసిన కరీనా కపూర్ ఎన్నో అవార్డులు అందుకుని ప్రేక్షకుల మెప్పు పొందింది.
ఈ బ్యూటీ ఆరు ఫిలిం ఫేర్ పురస్కారాలు(Filmfare Awards) కూడా సొంతం చేసుకుంది. బాలీవుడ్ నటీనటుల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న వారిలో ఈ హీరోయిన్ ఒకరు. రెఫ్యూజీ మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత అశోకా, కభీ ఖుషీ కభీ గమ్(Kabhi Khushi Kabhi Gum). ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. వీటితో పాటుగా చమేలీ, దేవ్, ఓంకారా, జబ్ వియ్ మెట్,(ఉత్తమ నటిగా అవార్డు), వియ్ ఆర్ ఫ్యామిలీ, 3 ఇడియట్స్, బాడీగార్డ్(Bodyguard), రా.వన్, భజరంగీ భాయీజాన్(Bajrangi Bhaijaan), కుర్బానా వంటి సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అతితక్కువ సమయంలో కరీనా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది.
కెరీర్ పిక్స్‌లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ తోటి నటుడు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతోంది. అటు పలు ఆడదపడద మూవీల్లో నటిస్తుంది. ఇక రీసెంట్ గా భర్త సైఫ్ అలీఖన్ (Saif Ali Khan)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ నిందితుడి చేతిలో అనేకసార్లు కత్తిపోటుకు గురైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోల్లో అంతా చూసే ఉంటారు.
ఇకపోతే తాజాగా కరీనా కపూర్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒకటి రాసుకొచ్చింది. ప్రస్తుతం కరీనా రాసుకొచ్చిన ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. టైమ్ వచ్చినప్పుడు ఎవరైన సరే జీవితం మన మెడలు వంచి పాఠాలు నేర్పిస్తుందని కరీనా చెప్పుకొచ్చింది. అలాగే అందరికంటే మనమే తెలివి గలవారమని అనుకుంటామని.. కానీ లైఫ్‌లో మనకు మనం అనుకునే సిద్ధాంతాలు, ఊహాగానాలు ఏవీ కూడా నిజాలు కావని ఈ నటి పేర్కొంది. ఈ రాతలకు కరీనా ఓ హార్ట్ ఎమోజీ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






