Kareena Kapoor: భర్త పై కత్తితో దాడి.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

by Gugulothu.Kavitha |

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై గురువారం క‌త్తితో దాడి జ‌రిగిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

Kareena Kapoor: భర్త పై కత్తితో దాడి.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై గురువారం క‌త్తితో దాడి జ‌రిగిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియ‌ని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబ‌డి క‌త్తితో ఆరు సార్లు దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో న‌టుడు గాయ‌ప‌డ్డాడు. దీంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు అత‌డిని ముంబైలోని లీలావతి ఆస్పత్రి(Leelavathi Hospital)కి త‌ర‌లించారు. దాడిలో న‌టుడికి ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అత‌ను హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor) పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా హీరోయిన్ కరీనా కపూర్ ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుగా కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్‌లు సంయమనం పాటించాలని, ఊహజనిత కథనాలను, కవరేజికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ.. ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తూ’ అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story