- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కర్మ నా అతిపెద్ద మతం.. నేను ఎవరినీ ఎప్పుడూ బాధపెట్టకూడదని భావిస్తాను కానీ’: Karan Johar
బాలీవుడ్ నటుడు కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తాజాగా ఈ నటుడు కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో కంగనా రనౌత్ తనను ‘బంధుప్రీతి పతాకధారి అలాగే సినిమా మాఫియా అని పిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, జోహార్ ఇలా అన్నాడు. ‘‘నాకు తెలియదు. ఇది ఎప్పుడు జరిగింది? నేను ఎప్పుడూ అంతర్గత వ్యక్తిని. ఎందుకంటే నా తండ్రి సినిమా పరిశ్రమలో ఒక భాగం’. అని చెప్పుకొచ్చారు.
అలాగే కర్మ నా అతిపెద్ద మతం అని వెల్లడించారు. నేను ఎవరినీ ఎప్పుడూ బాధపెట్టకూడదని అనుకుంటానని తెలిపారు. అలాగే నేను ఎవరి దారిలోనూ వెళ్లకూడదని నేను భావిస్తున్నాను. ఇక్కడ నేను ఒకరి కెరీర్‌ను నాశనం చేశానని ప్రజలు అంటారని అన్నారు. కానీ ఇది వాస్తవం కాదని వెల్లడించారు. నేను ఎవరికీ ఏమీ చేయలేదు.. ఎవరి విషయంలో తప్పు చేయలేదని, నేను నా పని చేశానని, ఇది ప్రజల నమ్మకమని కరణ్ జోహార్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.






