- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"కాంత" ట్రైలర్ విడుదల.. మరో మహానటి అవుతుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కాంత సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇప్పిటికే సినిమా నుండి విడుదల చేసిన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా ట్రైలర్ సైతం ఆకట్టుకునే విధంగా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కాంత సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇప్పిటికే సినిమా నుండి విడుదల చేసిన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా ట్రైలర్ సైతం ఆకట్టుకునే విధంగా ఉంది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన ఓ యువనటుడి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఆద్యంతం భావోద్వేగాలు, సస్పెన్స్ తో కూడుకున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి సైతం ముఖ్యమైన పాత్రలో నటించారు.
తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అదే విధంగా సముద్రఖని సైతం కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మించారు. 1950 బ్యాక్ డ్రాప్ లో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ట్రైలర్ విడుదల చేసి సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. VIDEO






