- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannappa: ‘కన్నప్ప’ ట్రైలర్ అప్‌డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) డైరెక్షన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ (Kannappa).

దిశ, సినిమా: ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) డైరెక్షన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). డైనమిక్ హీరో మంచు విష్ణు (Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ అప్‌డేట్ ఇస్తూ విష్ణు లుక్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘విశ్వాసం.. అగ్ని.. ఉగ్రత.. జూన్ 13న ఆ దివ్య యోధుడి పిలుపు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. కన్నప్ప ట్రైలర్ ఉరుములతో వస్తుంది. మరెవరికీ లేని భక్తుడి గాథను చూడటానికి సిద్ధంగా ఉండండి. హర్ హర్ మహాదేవ్.. హర్ ఘర్ మహాదేవ్’ అంటూ ట్రైలర్ రిటీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్‌తో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.






