- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నప్ప టికెట్ ధరలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
కన్నప్ప సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్,

దిశ, వెబ్ డెస్క్: కన్నప్ప సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను రూ.50 వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. అంతే కాకుండా సినిమా విడుదలైన తరవాత పది రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కన్నప్ప సినిమాలో మంచు విష్ణు హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో హీరో ప్రభాస్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రభాస్‌తో పాటు సీనియర్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం చిత్రంలో నటించారు. ఇప్పటికే సినిమా ట్రైలర్ విడుదల కాగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. మరి ఆ అంచనాలను కన్నప్ప రీచ్ అవుతాడో లేదో చూడాలి.






