Shivaraj Kumar : చిన్నపిల్లాడి నుంచి సైకిల్ తీసుకుని రైడె ఎంజాయ్ చేసిన స్టార్ హీరో.. నెట్టింట క్యూట్ వీడియో వైరల్

by Chukka Sudharani |

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

Shivaraj Kumar : చిన్నపిల్లాడి నుంచి సైకిల్ తీసుకుని రైడె ఎంజాయ్ చేసిన స్టార్ హీరో.. నెట్టింట క్యూట్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. క్యాన్సర్ (Cancer) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈయన వెంటనే సినిమాలపై ఫోకస్ పెట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివరాజ్ కుమార్ ప్రజెంట్ ‘45 ది మూవీ’ (45 The Movie) తో బిజీగా ఉంటూనే.. తెలుగులో రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ సినిమాలో కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా.. ఇటీవల పెద్ది సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇలా ఫుల్ యాక్టీవ్‌గా ఉండే శివరాజ్ కుమార్‌కు సంబంధించి లేటెస్ట్‌గా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆయన తనలోని చిన్నపిల్లాడిని నెటిజన్లకు పరిచయం చేశారు. వాకింగ్‌ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన శివన్నా.. అక్కడే ఉన్న ఒక చిన్న కుర్రాడి నుంచి సైకిల్‌ తీసుకుని సరదాగా రైడ్‌కు వెళ్లారు. స్పీడ్‌గా సైకిల్‌ తొక్కుతూ ఆక్షణాలను ఆనందించారు. అనంతరం ఆ పిల్లాడికి సైకిల్‌ తిరిగిచ్చేశారు. అతడితో కాసేపు సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు శివన్న సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.

Next Story