- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు ప్రేక్షకులపై కన్నడ నటుడి కామెంట్స్
కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగులో

దిశ, సినిమా : కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శివ రాజ్ కుమార్.. ‘‘వేద’ తర్వాత మళ్లీ ‘45’ మూవీ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. నాలుగైదు నిమిషాల్లోనే అర్జున్ జన్య అద్భుతంగా స్టోరీని నెరేట్ చేశారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా అనిపించింది. ఈ కథను మీరే డైరెక్ట్ చేయమని సలహా ఇచ్చాను. ముందుగా ఓ రెండు మూడు సీన్లు యానిమేషన్స్‌లో అర్జున్ చిత్రీకరించారు. రమేష్ ఆ సీన్లు చూసి సినిమా అవకాశం ఇచ్చారు. అర్జున్ తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు. తెలుగులో మా మూవీని మైత్రి రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. కన్నడలో ఆల్రెడీ సక్సెస్ అయింది. ఈ మూవీని చూస్తే కచ్చితంగా ప్రతీ ఒక్క ప్రాణిని ప్రేమిస్తారు.. గౌరవిస్తారు. జనవరి 1న మా మూవీని అందరూ చూడండి’ అని కోరారు.






