ప‌వ‌న్ సినిమాకు క‌న్న‌డ ఎఫెక్ట్.. థియేట‌ర్ వ‌ద్ద‌ ప్లెక్సీల చింపివేత‌

by Ajay Maddhiboyina |

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుకు సైతం క‌న్న‌డ భాష ఎఫెక్ట్ త‌గిలింది. బెంగుళూరులోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీ క‌న్న‌డ‌లో లేద‌ని క‌న్న‌డీకులు ఆందోళ‌న చేప‌ట్టారు.

ప‌వ‌న్ సినిమాకు క‌న్న‌డ ఎఫెక్ట్.. థియేట‌ర్ వ‌ద్ద‌ ప్లెక్సీల చింపివేత‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుకు సైతం క‌న్న‌డ భాష ఎఫెక్ట్ త‌గిలింది. బెంగుళూరులోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీ క‌న్న‌డ‌లో లేద‌ని క‌న్న‌డీకులు ఆందోళ‌న చేప‌ట్టారు. అక్క‌డ ఏర్పాటు చేసిన ప్లెక్సీల‌ను చింపివేశారు. ఈ క్ర‌మంలో అభిమానులు క‌న్న‌డీకుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఘ‌ట‌నాస్థ‌లంలో ఉధ్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇరువురిని శాంతిపజేశారు.

ఇదిలా ఉంటే గ‌త కొంత‌కాలంగా క‌ర్నాట‌క‌లో భాషా వివాదం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. హీరో క‌మ‌ల్ హాస‌న్ థ‌గ్ లైఫ్ సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో త‌మిళం నుండే క‌న్న‌డ పుట్టింద‌ని కామెంట్లు చేయ‌డంతో ఆ సినిమా విడుద‌ల‌నే క‌ర్నాట‌క‌లో బ్యాన్ చేశారు. ఆ త‌ర‌వాత క‌ర్నాట‌క‌లో భాష వివాదం కొన‌సాగుతూనే ఉంది. భాష‌కు సంబంధించి ఏ చిన్న ఇష్యూ అయినా దానిని క‌న్న‌డీకులు సీరియ‌స్ గా తీసుకుంటున్నారు. ప్లెక్సీల‌లో, ఇత‌ర చోట్ల ఎక్క‌డ క‌న్న‌డ కాకుండా ఇత‌ర భాష క‌నిపించినా స‌హించ‌డం లేదు. VIDEO

Next Story