- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్వెంచర్ థ్రిల్లర్ ‘BRB’ మూవీలో బంపర్ ఆఫర్ అందుకున్న కన్నడ బ్యూటీ.. క్యూరియాసిటీని పెంచుతున్న పోస్ట్
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటోంది.

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటోంది. ‘సప్త సాగరాలు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo)మూవీతో వచ్చి హిట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం రుక్మిణి వసంత్ తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ‘మదరాసి’ చిత్రంలోనూ నటించనుంది. అంతేకాకుండా ఈ అమ్మడు కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ‘ACE’లోనూ హీరోయిన్‌గా కనిపించనుంది.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాలు ఈ ఏడాదిలోనే థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. తాజాగా, రుక్మిణి మరో బంపర్ ఆఫర్ అందుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘BRB’ చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తోంది. అనూప్ బండారి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈమూవీకి సంబంధించిన షూటింగ్ మొదలవగా.. ఇందులో రుక్మిణి కూడా పాల్గొంటుంది. ఈ విషయాన్ని తెలుపుతూ BRB నేచర్ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ సినిమాలో కిచ్చా సుదీప్‌తో రొమాన్స్ చేయనున్నట్లు హింట్ ఇచ్చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఇందులో ఆమె హీరోయిన్‌గా నటించనుందా.. లేక మరో పాత్రలో కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ అమ్మడు పోస్టుతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. కొంతమంది ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
Actress Rukmini Vasanth has dropped a hint about being part of #KicchaSudeep ’s upcoming big project #BRBMovie through her latest Instagram story. She has also followed Kiccha Sudeep and director Anup Bhandari on Instagram, sparking more curiosity among fans. #BRBFirstBlood pic.twitter.com/pHGKW12Ilf
— International Khiladi 𝕏 (@ikhiladiiX) April 20, 2025






